5459) కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా

** TELUGU LYRICS **

కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా (2)
స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలిపూజ వేడుకగా (2)
రండి దైవజనమా రారండి
ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగివచ్చెను మన ముందుకు (2)
జీవవిందు నిత్య జీవవిందు పరమునుండి వచ్చిన ప్రేమ విందు (2)

నింగిదిగిన నీతిసూర్యుడస్తమించిన గిరి ఇది అస్తమించినగిరి ఇది
కరుణ క్షమాపణలు పొంగి పొరలె దైవనిర్జరీయిది దైవనిర్జరీయిది (2)
ఇహమునుండి పరమునకు సోపాన గిరి ఇది (2)
తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరి ఇది (2)
||రండి|| ||జీవ||

| సరిగా రిగ | పా గపదా | ససదపగరి | గా ;; |
| రిగపా గప | దా పదసా | రిరిసదపగ | దా ;; |
| దగరిగసరి | దా;; | పసదసపద | గా ;; |
ఆఆఆ… ఆఆఆ… ఆఆఆ… ఆఆఆఆ… 

నిత్య జీవమిచ్చుటకు యేసుపంచిన భోజ్యమిది యేసుపంచిన భోజ్యమిది
శాంతి సమాధానములనిచ్చు ప్రేమ సామ్రాజ్యమిది ప్రేమ సామ్రాజ్యమిది
తరతరాల జనావళికి దైవ సాన్నిధ్యమిది (2)
సర్వరోగ పీడితులకు ప్రభువు ఒసగు వైద్యమిది (2)
||రండి|| ||జీవ||
తనన - 8 తనా 

శత్రువులను ప్రేమించు పరోపకారి విందు ఇది పరోపకారి విందు ఇది
అపకారికి ఉపకారము నేర్పిన జీవధారి విందు ఇది జీవధారి విందు ఇది
పూర్ణశాంతినొసగు ఉత్తాన క్రీస్తు విందు ఇది
సంపూర్ణ శాంతినొసగు ఉత్తాన క్రీస్తు విందు ఇది
స్వర్గమునే మదినింపు క్రీస్తురాజు విందు ఇది (2)
||రండి|| ||జీవ|| ||కమ్మని||

-----------------------------------------------------------
CREDITS : Music : Naveen
Vocals : Harini, Sindhuja, Shiny Kurian
-----------------------------------------------------------