5460) నీవే నాకు సర్వం దేవా నీవే నాకు ఆధారం దేవా

** TELUGU LYRICS **

నీవే నాకు సర్వం దేవా నీవే నాకు ఆధారం దేవా 
నీవే నాకు సర్వం దేవా నీవే నాకు ఆధారం దేవా (2)
నీ సన్నిదే నాకు చాలయ్య 
నీ సన్నిదే నాకు మేలయ్య (2)
నిన్నే స్తుతియించి కొనియాడేదా నిన్నే ఘనపరిచి కొనియాడేదా
నిన్నె ఆరాధించి కొనియడేద నిన్నె మహిమ పరిచి కొనియాడేదా 
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

అతి శ్రేష్ఠుడవు నీవు అతికాంక్షనీయుడవు 
అతి సుందరుడవు నీవు పదివేలలో 
మా దుర్గము కేడము మా కోటయు నీవే 
నా దాగు చోటు స్థలము నీవే  
గాఢాంధకారపు లోయలలో నే సంచరించిన భయపడను 
ఏ అపాయము నన్ను చేరనే చేరదు
నా బ్రతుకు దినములు అంతటిలో  నీ కృప క్షేమములే ఉండగా 
నీ సన్నిధిలో నివాసం చేసెదను 
||నిన్నే స్తుతియించి కొనియాడేదా||

నా ఊహలకందనివి నివ్వు చేసే కార్యములు 
నీ మేలులు కొలువగ చాలదు జీవితము 
అర్హత లేని నన్ను ఎన్నుకొని ఏర్పరచి
నీ దాసునిగ నన్ను నిలబెట్టవయ్య
కోత ఎంతో విస్తారం అని తెలిపి కోసేవానిగ నన్ను పిలిచి
నీ బూరగ మలిచిన విధముకు స్తోత్రమయ్యా
నీ ప్రేమ వర్ణింప నాశక్యం నీ క్రియలు వివరింప ఆశ్చర్యం 
నా ఎడల నీకున్న కృప ఎంత అద్భుతము.
||నిన్నే స్తుతియించి కొనియాడేదా||

నీ వాక్యమే నన్ను బ్రతికించే ఔషధము 
నా త్రోవలో నన్ను నడిపే దీపము
నీవు చేసిన మేలులను తలపోసుకున్నప్పుడు 
ఆనందముతో ఉప్పొంగెను నా హృదయం
నీ మార్గాము లోనే నడిచెదను నీ సువార్తను ప్రకటించెదను
నీ సాక్షిగా ఈ భూవిలో బ్రతికెదను
నీ రాకడ కొరకై సంఘముగా మేము సిద్ధముగానే ఉండెదము 
నిరీక్షణతో నీ వైపే చూచేదము
||నిన్నే స్తుతియించి కొనియాడేదా||

--------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bishop G. Henry. Jennings
Vocals & Music : Praveen Ritmos & Sareen Imman
--------------------------------------------------------------------------------