5558) జగతికి జనకుడు యేసండి పుట్టెను నేడు చూడండి

** TELUGU LYRICS **

జగతికి జనకుడు యేసండి 
పుట్టెను నేడు చూడండి (2)
యెహోవా సన్నిధిలో ఈవేళ 
రారాజు జన్మవార్త వినరండీ (2)
వేగమే మీరు రారండీ 
యేసును చూచి వెళ్ళండి (2)
హల్లెలూయా స్తుతి గీతం పాడండి 
హల్లెలూయా స్తోత్రనాదం చేయరాండి (2)
||జగతికి జనకుడు||

ఆకాశ మహా ఆకాశముల్ 
పట్టజాలని ఆ దేవుడు (2)
ప్రతిమనిషి హృదయాన పవలింప 
ఈ ఇలలోన జన్మించే వినరండీ?
||వేగమే మీరు రారండీ||

విశ్వాసులందరి ఐక్యతలోనే
యేసయ్య జన్మదిన ఉత్సవముంది (2)
ప్రతి మనిషి రక్షణకై యేసుని జన్మ 
ఆ రక్షకుని జన్మవార్త వినరండీ
||వేగమే మీరు రారండీ|| ||జగతికి||

-----------------------------------------------
CREDITS : 
-----------------------------------------------