5557) బేత్లెహేములోన గొప్ప చిత్రమాయెనే

** TELUGU LYRICS **

బేత్లెహేములోన గొప్ప చిత్రమాయెనే
పశువుల పాక పరలోకమాయెనే
తూర్పు దిక్కు చుక్క నేడు మెరిసిపోయేనే
జగమంతా పండుగల్లె మారిపోయేనే [2] 
చక్కనై నా చిన్ని యేసు చిరునవ్వు విసిరెనే
చీకటంత చిన్నబోయి దివ్య కంతులెగసెనే 
చిన్న పెద్ద అంత కలిసి సంబరాలు చేధము 
లోక రక్షకుడు పుట్టేనేనేడు 
లోకమంత వెలుగు తెచ్చెనే చూడు (2)


దూత తెలిపే అందరికి గొప్ప శుభవార్తనే 
గొల్లలంత విని సంతసించి గంతులేసెనే
జ్ఞానులంతా కలిసి వచ్చి తార వెంబడించెనే
బంగారము సాంబ్రాణి బోలమర్పించెనే
ప్రభువుని చూడగానే పరవశించిపోయేనే
సర్వశక్తిదేశుని పాడి కొనియాడెను
సృష్టికర్త రాకకై సంబరాలు చేధము

లోక రక్షకుడు పుట్టేనేనేడు 
లోకమంత వెలుగు తెచ్చెనే చూడు (2)

దివి నుండి దేవుడు దీనునిగా వచ్చెనె
కన్యాగర్భమందు పరిశుద్ధునిగా పుట్టెనే
పాపమంత బాపను పరము వీడి వచ్చెనే
విశ్వసించువారికి విదుదల తేనే
మార్గము సత్యము జీవము ఆయనే
మానవాలికై ఇంత ప్రేమనే చూపేనే 
రక్షకుని రాకకై సంబరాలు చేధము

లోక రక్షకుడు పుట్టేనేనేడు 
లోకమంత వెలుగు తెచ్చెనే చూడు (2)

బేత్లెహేములోన గొప్ప చిత్రమాయెనే
పశువుల పాక పరలోకమాయెనే
తూర్పు దిక్కు చుక్క నేడు మెరిసిపోయేనే
జగమంతా పండుగల్లె మారిపోయేనే  
చక్కనై నా చిన్ని యేసు చిరునవ్వు విసిరెనే
చీకటంత చిన్నబోయి దివ్య కంతులెగసెనే 
చిన్న పెద్ద అంత కలిసి సంబరాలు చేధము 

లోక రక్షకుడు పుట్టేనేనేడు 
లోకమంత వెలుగు తెచ్చెనే చూడు (4)

--------------------------------------------------------
CREDITS : Music : Arif Dani
Lyrics & Vocals : Kiran D & Priya Arif
--------------------------------------------------------