** TELUGU LYRICS **
ఇంతవరకు కాచి మమ్ము కృపను చూపావు
ఇన్నినాళ్ళు నీదు నీడలో భద్రపరచావు
ఎంతైనా నమ్మదగిన ప్రభుడవు
స్థిరపరచి బలపరచుచున్నావు
మాకున్న కేడెము నీవే - మాకున్న బలము నీవే
మాకున్న ఆధారం నీవే - మాకున్న సహాయం నీవే
ఇన్నినాళ్ళు నీదు నీడలో భద్రపరచావు
ఎంతైనా నమ్మదగిన ప్రభుడవు
స్థిరపరచి బలపరచుచున్నావు
మాకున్న కేడెము నీవే - మాకున్న బలము నీవే
మాకున్న ఆధారం నీవే - మాకున్న సహాయం నీవే
వంకర త్రోవలను తిన్నగా చేసి నడుపుచున్నావు
అడ్డుగోడలను కూల్చి మార్గమేర్పరచుచున్నావు
ఊహించలేని మేళ్లతో మము తృప్తిపరచుచున్నావు
నీ కరుణ హస్తము మాపై వుంచి వర్ధిల్లజేయుచున్నావు
ఊహించలేని మేళ్లతో మము తృప్తిపరచుచున్నావు
నీ కరుణ హస్తము మాపై వుంచి వర్ధిల్లజేయుచున్నావు
పడిన స్థితిలో నుండి లేపి ఘనపరచుచున్నావు
కార్యములను సఫలము చేసి ఆదుకొనుచున్నావు
నీ కృప దూరము చేయక మము చేరదీయుచున్నావు
నీ శక్తి పరిపూర్ణముగా మాలో నింపి నడుపుచున్నావు
యోగ్యతే లేకుండగ మమ్ము వెదకి రక్షించావు
విలువగు పాత్రలుగా మలచి సాక్షులుగా నిలిపావు
నీ మందిరములో నిలిచే భాగ్యము మాకు అనుగ్రహించావు
నీ పిల్లలుగా పులువబడుటకు ధన్యతను యిచ్చావు
--------------------------------------------------------------------------
CREDITS : Vocals : Percy Joy, Blessy Joy
Lyrics, Tune, Music, Vocals : Bro.Praveen Bandi
--------------------------------------------------------------------------