** TELUGU LYRICS **
సర్వలోక అధినేతవే
నన్ను నడిపే నా విభుడవే
నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై
ఈ హితవత్సరం నీ కృప పొందుచూ సాగెద నీ నీడలో
స్తుతియింతును ఘనపరతును ఆరాధించి సేవింతును
నన్ను నడిపే నా విభుడవే
నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై
ఈ హితవత్సరం నీ కృప పొందుచూ సాగెద నీ నీడలో
స్తుతియింతును ఘనపరతును ఆరాధించి సేవింతును
శోధన బాధలలో అడుగులు తడబడిన
జయ ధ్వనులతో నన్ను గెలిపించినావే
నా దుఃఖ దినములు సమాప్తమగునని
నీ వాగ్ధానముతో బలపరచినావే
రక్షణయే నీకు ప్రాకారములనియు
ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు
సెలవే యిచ్చి నన్ను స్థిరపరచి సాక్షిగా నిలిపితివే
||స్తుతియింతును||
జయ ధ్వనులతో నన్ను గెలిపించినావే
నా దుఃఖ దినములు సమాప్తమగునని
నీ వాగ్ధానముతో బలపరచినావే
రక్షణయే నీకు ప్రాకారములనియు
ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు
సెలవే యిచ్చి నన్ను స్థిరపరచి సాక్షిగా నిలిపితివే
||స్తుతియింతును||
జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం
నీతో ప్రతిక్షణము ఆస్వాదించెదను
జీవన మలిసంధ్య నీతోనే సహవాసం
కలనైన మరువను నీ సహచర్యము
నీలో ఫలించుచూ పరిగెత్తెద నేను
నీతో జీవించుచూ పైపైకి ఎదిగెదను
ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివే
||స్తుతియింతును||
అల్పమైన వాడను స్వల్పకాల ఆయువును
అంతులేని ప్రేమతో అభయము నిచ్చి
వెర్రివాడనైన నన్ను వెదకి తుదకు రక్షించి
నన్ను ఘనపరచి ఘనులతో నిలిపి
శాశ్వత కాలముకు శోభాతిశయముగాను
బహు విస్తార తరములకు సంతోష కారణముగా
నిర్ధారణ చేసి నన్ను నియమించి ఊరేగించితివే
||స్తుతియింతును||
--------------------------------------------------------------
CREDITS : Music : Dr. Kenny Chaitanya
--------------------------------------------------------------