** TELUGU LYRICS **
అనుదినము నీవు భరియించినావు మా భారము
నీ కృపతోనే మము కాచినావు గడిచిన కాలము
ఏ కీడు మా దరికి రాకుండా - అవమానముపాలు కాకుండగా
దీర్ఘాయువునిచ్చి దీవించిన యేసయ్యా - నీకే స్తోత్రము
దివారాత్రులు నిన్నే - నిత్యము స్తుతియింతుము (2)
||అనుదినము||
నూతనమైన నీ వాత్సల్యమే - ఇల జీవించుటకు కారణము
మట్టివారమని మమ్ములను చేసికొంటివి జ్ఞాపకము (2)
తనయులపై తండ్రి - జాలిపడునట్లు (2)
జాలిని చూపితివి - ఆశ్రయ దుర్గముగా ఉంటివి (2)
దీర్ఘాయువునిచ్చి దీవించిన యేసయ్యా- నీకే స్తోత్రము
దివారాత్రులు నిన్నే - నిత్యము స్తుతియింతుము (2)
||అనుదినము||
శాశ్వతమైన నీదు ప్రేమయే నను దీవించుటకు కారణము
మాటను ఇచ్చి మరువక - నెరవేర్చుచుంటివి వాగ్ధానము (2)
తగిన వేళలో - హెచ్చించునట్లు (2)
నీ దృష్టిని నిలిపితివి - ఉన్నత స్థితిలో ఉంచితివి (2)
దీర్ఘాయువునిచ్చి దీవించిన యేసయ్యా- నీకే స్తోత్రము
దివారాత్రులు నిన్నే - నిత్యము స్తుతియింతుము (2)
||అనుదినము||
-----------------------------------------------
CREDITS :
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------