** TELUGU LYRICS **
యూదా గోత్రపు సింహమా
మా కొరకే వచ్చిన దైవమా
రాజులకు రారాజు
రక్షకుడై జన్మించెను
మహిమ గల మహారాజు
మానవుడై దిగివచ్చెను (2)
సంబరమాయే ఈ జగమంతా
సందడి చేసే ఈ జనులంతా (2)
హల్లెలూయ హల్లెలూయ హ్యాపీ Christmas
హల్లెలూయ హల్లెలూయ Merry Christmas (2)
||రాజులకు||
బేత్లెహేము పురములో
కన్య మరియ గర్భములో (2)
జన్మించెను దేవ దేవుడు - ఉదయించెను నీతిసూర్యుడు (2)
||సంబరమాయే||
పాపములను క్షమియించుటకు
నీతి మార్గములలో నడిపించుటకు (2)
జన్మించెను నీతిమంతుడు
దిగివచ్చెను అధ్వితీయుడు (2)
||సంబరమాయే||
తండ్రి చిత్తమును నెరవేర్చుటకు
వ్యాధి బాధలను తొలగించుటకు (2)
జన్మించెను పరమ వైద్యుడు
ఏతెంచెను యేసు దేవుడు (2)
||సంబరమాయే||
---------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bandela Naga Raju
Vocals & Music : Joshua Gariki & Suresh
---------------------------------------------------------------------