5390) మము కరుణించి మహిమను వీడి మాలో ఒకనిగా మనుష్యకుమారునిగా

** TELUGU LYRICS **

మము కరుణించి మహిమను వీడి 
మాలో ఒకనిగా మనుష్యకుమారునిగా 
ధరణిపై వెలసిన మా దేవుడా దక్షతగల మా రక్షకుడా
హల్లెలూయ (4) హల్లెలూయ అని పాడెదము 
||మము||

ఇంటింట పండుగై ప్రత్యక్ష దైవమై 
చిన్నారి యేసువై పుట్టావయ్యా 
ఆది అంతములేని మా దేవుడా 
బలవంతుడా మహోన్నతుడా
||మము||

అరుణోదయముతో మము దర్శించి 
అమరత్వానికి నడిపించితివి 
అద్వితీయుడా ఆశ్చర్యకరుడా 
ఆరాధింతును ఆత్మతో నిన్ను
||మము||

రక్తమై చిందెను నీ నిత్య ప్రేమ
సిలువలో మా యెడల చూపిన ప్రేమ 
మాకై ప్రాణము పెట్టిన ప్రేమ
కొలువ లేనిది మరపురానిది
||మము||

-----------------------------------------------------------
CREDITS : Music : Augustine 
Lyrics & Vocals : Anandarao & Anitha 
-----------------------------------------------------------