5391) పరలోక రారాజు భువినేలే మహారాజు

** TELUGU LYRICS **

పరలోక రారాజు భువినేలే మహారాజు
కన్యమరియ గర్భాన నాకొరకు జన్మించెన్ (2)
వాక్యమే శరీరధారై నరరూపమెత్తాడు
తన మహిమనే వీడి కడుదీనుడయ్యాడు
తారుమారు జరిగించి
నా స్థానములో నిలిచి
అబ్రాహాము వంశములో
నను చేర్చగా వచ్చెన్
తన ఆశీర్వాదముగా 
నను మార్చగా వచ్చెన్
నే క్రొవ్విన దూడవలె గంతులు వేసెదన్
నీతి సూర్యుడుదయించెనని చాటెదన్ (2)
||పరలోక రారాజు||

ఆదాము చేసిన పాపం
రూపుమాప దిగి వచ్చెన్
అపవాదిని హతమార్చన్
యేసు నామమును దాల్చెన్ (2)
తారుమారు జరిగించి
నా స్థానములో నిలిచి
అబ్రాహాము వంశములో
నను చేర్చగా వచ్చెన్
తన ఆశీర్వాదముగా 
నను మార్చగా వచ్చెన్
నే క్రొవ్విన దూడవలె గంతులు వేసెదన్
నీతి సూర్యుడుదయించెనని చాటెదన్ (2)
||పరలోక రారాజు||

పరిశుద్ధుడు పరిశుద్ధుడని
నిత్యం స్తుతియింపబడి 
అద్వితీయ దేవుడు ఆదిసంభూతుడు (2)
తారుమారు జరిగించి
నా స్థానములో నిలిచి
అబ్రాహాము వంశములో
నను చేర్చగా వచ్చెన్
తన ఆశీర్వాదముగా 
నను మార్చగా వచ్చెన్
నే క్రొవ్విన దూడవలె గంతులు వేసెదన్
నీతి సూర్యుడుదయించెనని చాటెదన్ (2)
||పరలోక రారాజు||

---------------------------------------------------
CREDITS : Music : M. Ashok Das
Lyrics, Tune, Vocals : Rajani Das 
---------------------------------------------------