5392) లోకాలనేలే రారాజు తాను మానవాళి కొరకు దిగివచ్చినాడు

** TELUGU LYRICS **

లోకాలనేలే రారాజు తాను 
మానవాళి కొరకు దిగివచ్చినాడు (2)
పాడుదమందరం - స్తోత్రం చేసేదం
రాజాధిరాజు ని కొనియాడుదం (2)

దైవ స్వరూపము గలవాడు తాను 
దైవ సమానుడుగా ఉన్నాడు చూడు
సమస్త సృష్టికి కారకుడు తాను
జగత్తుకు మునుపే ఉన్నాడు యేసు (2)
మనుష్యుని పోలికగా దాసుని రూపములో
రిక్తునిగా భువికి దిగివచ్చెను
దేవుని పోలికగా ప్రభువుతో ఏలికగా
నిన్ను దీవించుటకు జనియించెను (2)

ప్రాణము కన్న నిన్ను ప్రేమించి నోడు
నీకై మరణించగ జన్మించినాడు 
ప్రాణము నే నీకు ధారపోసినాడు
నీకుసమాధానము నివ్వగలిగినోడు
నమ్ముకున్న వారిని - నమ్మకముగా
నిత్య జీవమునకు నడిపించగలడు
కమ్ముకున్న చీకటిని శాశ్వతముగా 
నీ జీవితమునుండి తొలగించగలడు (2)

-----------------------------------------------------------
CREDITS : Music : Bro. K. J. W. Prem
Lyrics, Tune : Dr. K. Jagadeesh Paul
-----------------------------------------------------------