5385) యేసు పుట్టెను కన్య మరియకు బెత్లెహేము ఊరి నందు

** TELUGU LYRICS **

యేసు పుట్టెను కన్య మరియకు
బెత్లెహేము ఊరి నందు
లోకానికి అరుదెంచెను
ఆ పశులశాలయందు
ప్రవచనమే నెరవేరెను
పరిస్థతులే మారిపోయెను
||యేసు పుట్టెను||

చీకటిలో ఉన్న జనులకు
గొప్ప వెలుగుదయించెను
మరణములో ఉన్న వారు
జీవములోనికి దాటెను
మనలను రక్షించుటకు
మానవునిగా భువికి దిగి వచ్చెను
||యేసు పుట్టెను||

ఆశ్చర్యకరుడుగా వచ్చెను ఆలోచనా మనకు చెప్పెను
శరీరధారియై వచ్చెను
కృపాసత్యముతొ నిండెను
బలవంతుడుగా నిత్యుడగు తండ్రిగా
సమాధానా అదిపతిగా
||యేసు పుట్టెను||

నేడే నీ మనసు మార్చుకో
నీకై వచ్చెనని తెలుసుకో
నమ్మినవారికి రక్షణ
సిద్ధము చేసెను దేవుడు
విశ్వాసముంచుము ఆ యేసునందు
నిత్యజీవము నీకొసగును
||యేసు పుట్టెను||

---------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Sis. Prasanna Bold 
Lyrics, Tune & Music : Sudhakar Rapaka & Danuen Nissi
--------------------------------------------------------------------------------------