** TELUGU LYRICS **
వర్ణింపశక్యము కానీ
ఊహలకే అందనీ యేసు నీ దివ్య ప్రేమా
నా కోసమే నీవు ప్రాణమిచ్చినావు
నీ పాత్రగాను నన్ను మలచినావు (2)
వర్ణింపగలనా నీ ప్రేమా నా దేవా
వివరింపగలనా నీ ప్రేమా నా రాజా (2)
అగాధ స్థలములలోన విచిత్రముగా నను చేసి
నీ కొరకై నను నిర్మించితివే
సముద్రపు రేణువు కంటే విస్తారమైన తలంపులు
నా యెడల కలిగియుంటీవే
||వర్ణింపగలనా||
వెలలేని నాకై నీదు రక్తముతొ వెల చెల్లించి
నీ సొత్తుగా చేసుకున్నావే
నిరతము నీ సన్నిధిలో స్తుతుల ధూపము వేయుటకు
యాజకత్వమిచ్చావే
||వర్ణింపగలనా||
నీ మహిమను నా కిచ్చుటకు కల్వరి సిలువలోన
రిక్తునిగా మారితివే
నీ ప్రణాళిక నెరవేర్చి సంపూర్ణ సిద్ధి నొంద
నీ ఆత్మతో ముద్రించితివే
||వర్ణింపగలనా||
----------------------------------------------
CREDITS :
----------------------------------------------