** TELUGU LYRICS **
అక్షయుడ నీ గుణాతిశయములు ప్రచురింప దగినవి
ఊహకు అందవె నీ కార్యములు
రాజులైన యాజక సమూహముతొ చేర్చినావే (2)
స్తోత్రించెదను యేసయ్య భజియించెదను మనసార
ఊహకు అందవె నీ కార్యములు
రాజులైన యాజక సమూహముతొ చేర్చినావే (2)
స్తోత్రించెదను యేసయ్య భజియించెదను మనసార
నీ ఘన నామమును తలచీ (2)
||అక్షయుడ||
ఒంటరినై యుండగా నను నీవు పిలచితివే (2)
నీ ప్రేమ కనికరము నా యెడల చూపించి
నీ సేవకై నను ఎన్నుకున్నావు
నా తోడువై నడిపించుచున్నావు (2)
||స్తోత్రించెదను||
ఆరోగ్యమే వీడిన మరణము దరి చేరిన. (2)
సిలువలో నీ రుధిరం నాకు క్షేమం (2)
యెహోవా రాఫా స్వస్థత (2)
నీవేగా యెహోవా నిస్సి విజయము నీవేగ
||స్తోత్రించెదను||
నిందలలో నిలిపిన మనుషులె ఎదురు నిలచిన (2)
బ్రతుకుట క్రీస్తు కొరకె చావైతె మేలె (2)
నేను నా వారు నీకై యున్నాము
నీ రాజ్యముకై మేము పని చేయుచున్నాము (2)
||స్తోత్రించెదను||
-----------------------------------------------
CREDITS :
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------