** TELUGU LYRICS **
ఎంతగా నిను స్తుతియించినా - నా మనసు నిండదు
బ్రతుకంతా నిన్ను పాడినా - నా తనివితీరదు తీరదు
నేలనుండి నన్ను లేపినావయ్యా
బ్రతుకంతా నిన్ను పాడినా - నా తనివితీరదు తీరదు
నేలనుండి నన్ను లేపినావయ్యా
శిఖరముపై యేసు నన్ను నిలిపినావయ్యా
అ.ప. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును
ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతియింతును
ఏ అర్హత లేకున్ననూ - అవిధేయుడనైయున్ననూ (2)
అందలమెక్కించినావయా - అందని స్థితిలో నన్నుంచినావయా
అభిషేకించి - నీ కొరకు నిలుపుకున్నావయా (2)
బలహీనుడనైయున్ననూ - బహుశ్రమలలో నేనున్ననూ (2)
కృపతో బలపరిచినావయా - భయములన్నియూ తొలగించినావయా
బహుమందికి - దీవెనగ నన్ను ఉంచినావయ్యా (2)
ఆరోగ్యమే లేకున్ననూ - అందరూ విడిచియున్ననూ (2)
అనాధగా విడువలేదయా - అక్కరలన్ని నీవే తీర్చినావయా
ఆశీర్వదించి - నను వాడుకొనుచున్నావయా (2)
------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Pas. Prakash Paul Garu
Music & Vocals : Bro Sunil Garu & Bro Surya Prakash Garu
------------------------------------------------------------------------------------------