** TELUGU LYRICS **
తల్లడిల్లకే ఓ మనసా
చెమ్మగిళ్ళకే నా మనసా (2)
అలసిపోక సొలసిపోక వేచియుండుమ
యేసయ్య నిన్ను దీవించువరకు (2)
చెమ్మగిళ్ళకే నా మనసా (2)
అలసిపోక సొలసిపోక వేచియుండుమ
యేసయ్య నిన్ను దీవించువరకు (2)
కలత చెందకు కుమిలిపోకు
కష్టాలు ఎన్నైనా కలవరపడకు (2)
నా కొరకు ప్రాణమిచ్చినవాడు
నన్నెందుకు మరచిపోతాడు (2)
నాకంట కన్నీళ్లు తుడచివేస్తాడు
మానని గాయాలను బాగుచేస్తాడు (2)
భయము నొందకు బీతిచెందకు
బ్రతుకంత ఓడిన బలము తెచ్చుకో(2)
నన్నెంతో ప్రేమించినవాడు
నన్నెనడు విడచిపోలేడు (2)
నా భారమంత తేలిక చేస్తాడు
పగిలిన హృదయాన్ని బాగుచేస్తాడు (2)
ఊరకుండుము అదిరిపోకు
అపనిందలపాలైన వేధన పడకు (2)
కృపచేతనే రక్షించినవాడు
కంటి పాపల్లె కాపాడుకుంటాడు (2)
నా చింతలన్నీ తీర్చివేస్తాడు
విసిగిన ప్రాణాన్ని బాగుచేస్తాడు (2)
-------------------------------------------------------------
CREDITS : Music : G. Praveen Kumar
Song, Tune, Lyrics : Pas. Yesudas Garu
-------------------------------------------------------------