5332) నా తోడు నీవై ఉన్నావు ప్రభువా నా అండ నీవై నిలిచావు దేవా

** TELUGU LYRICS **

నా తోడు నీవై ఉన్నావు ప్రభువా
నా అండ నీవై నిలిచావు దేవా 
నాలోన పలికే స్తుతి గీతమే 
నీ ప్రేమయే నాకు జయగీతమే 
ఎనలేని నీ ప్రేమ అతి శ్రేస్టమే
ఆరాధన ఆరాధన ఆరాధన నా యేసయ్యాకే 

లోక ఆశలు కమ్మినా  
మరణఛాయలు వేంటాడినా 
విరిగి నలిగి వేసారిన విసికి వేసారి నే కృంగినా
నీదు ప్రేమతో పిలచినావు
నీదు కౌగిట దాచినావు
ఆరాధన ఆరాధన ఆరాధన నా యేసయ్యాకే 

నీదు వాక్యమే నాదు మార్గం 
నీదు నామమే నాకు జీవము
జీవాదాత నజరేయుడా 
ప్రాణదాత పరిశుద్దుడా
నీదు ప్రేమతో పిలచినావు
నీదు కౌగిట దాచినావు
ఆరాధన ఆరాధన ఆరాధన నా యేసయ్యాకే

-----------------------------------------------------
CREDITS : Music : A.C Dinakaran
Vocals : M Deva, M Ebineze
-----------------------------------------------------