5334) కఠినమైన హృదయాన్నీ కరిగించే ప్రేమ

** TELUGU LYRICS **

కఠినమైన హృదయాన్నీ కరిగించే ప్రేమ
కరుణలేని మనసులో కన్నీటిని పుట్టించే ప్రేమ
ప్రేమా ప్రేమా అది దేవుని ప్రేమా 
||కఠినమైన||

అమ్మ కడుపులో నాకు ప్రాణమిచ్చిన  ప్రేమ
అన్నీ కోల్పోయి నేనుంటే అండగా నిలిచిన ప్రేమ
ఆరిపోయే నా ఆత్మ దీపాన్ని వెలిగించిన ప్రేమా అది నా దేవుని ప్రేమా 
||కఠినమైన||

ఎవరికి తెలిసిందీ ఈ ప్రేమ ఎవరు గుర్తించారు ఈ ప్రేమ
వేకువ ఉదయాన విరిసిన కమలం నా ఈ దేవుని ప్రేమ
కన్నీటి హృదయాన కుమ్మరించే పసిపాప చిరునవ్వు నా దేవుని ప్రేమా
||కఠినమైన||

లోకం గుర్తించనిదీ ఈ పరలోక ప్రేమ మనిషికి అర్థం కానిదీ ఈ కల్వరి ప్రేమ
ఏ కవీ రాయలేని కమ్మనైన ప్రేమగీతం ఈ దేవుని ప్రేమా
ఎదలోతుల్లో దాగిన నులివెచ్చని ఆత్మ స్పర్శ నా దేవుని ప్రేమా
ఎవరికి తెలిసిందీ ఈ ప్రేమ ఎవరు గుర్తించారూ నా ఈ దైవుని ప్రేమ 
||కఠినమైన||

---------------------------------------------------
CREDITS : Dr B Ravi Kanth garu
---------------------------------------------------