5381) రాజుల రాజు యేసయ్య నీకోసం పుట్టినాడు చూడయ్యా

** TELUGU LYRICS **

రాజుల రాజు యేసయ్య 
నీకోసం పుట్టినాడు చూడయ్యా 
పరలోక దేవుని తనయునిగా 
నరావతానిగా జన్మించేగా 
పాడాలి పాడాలి యేసయ్య జన్మ వార్త ఊరంతా పాడాలి రా 
చాటాలి చాటాలి రక్షకుని జన్మ వార్త జగమంతా చాటాలి రా 

దూతల మాదిరి గాత్రము లెత్తుచు 
గొల్లల మాదిరి నాట్యము చేయుచు
దూతల మాదిరి గాత్రము లెత్తుచు
గీతాలు పాడుతూ ఖ్యాతిని తెలుపుచూ 
చీకటి పారద్రోలే వెలుగై వచ్చెనని 
జీవపు వెలుగును ఇచ్చునని 
మరణ పాషముల్ విడిపించ వచ్చనని 
ఆ యేసు వార్తలు చాటింపును 

పాడాలి పాడాలి యేసయ్య జన్మ వార్త 
ఊరంతా పాడాలి రా 
చాటాలి చాటాలి రక్షకుని జన్మ వార్త 
జగమంతా చాటాలి రా

నమ్మిన వారికి పరలోకమించునని 
నమ్మని వారిని నరకంలో వేయునని 
దోషములెల్ల తీసివేయు నాధుడని 
పాపములన్నియు బాపినని 
జీవపు వెలుగై నీకై వచ్చెనని 
నిత్యజీవం ఇచ్చునని 

పాడాలి పాడాలి యేసయ్య జన్మ వార్త 
ఊరంతా పాడాలి రా 
చాటాలి చాటాలి రక్షకుని జన్మ వార్త 
జగమంతా చాటాలి రా

------------------------------------------------------
CREDITS : Music : Sudhakar Rella
Lyrics, Tune, Vocals : Bro. Kj Philip
------------------------------------------------------