5380) భూగోళమంతా దద్దరిల్లేలా మన ఊరు వాడా మారుమ్రోగేలా

** TELUGU LYRICS **

భూగోళమంతా దద్దరిల్లేలా - మన ఊరు వాడా మారుమ్రోగేలా 
సకల సృష్టంతయు నాట్యమాడేలా - మదిలో అణువణువు చిందులేసేలా 
దేవుని హృదయం సంతోషించేలా - ఆత్మ దేవుడు ఆనందించేలా 
అన్యజనుల కనుమబ్బు తొలగేలా
సందడి చేద్దామా ఈ క్రిస్మస్ కాంతులలో - చాటిచెప్పుదామా క్రీస్తేసుని ఆగమనం 
గానము చేసెదమా యేసుని గుణాతిశయములనే 
ఆరాధించెదమా మన పూర్ణహృదయముతో

మన శిక్షకు ప్రతిగా తానే సిలువ శిక్ష పొందినాడే 
తన నీతిని బహుమానంగా మనకందరికిచ్చాడే 
చెడిపోయిన స్త్రీని అమ్మా అని పిలచి 
కరడుగట్టిన కఠినాత్ములకు రక్షణనిచ్చాడే 
లోకమునేలు అంధకారమును పారదోలినాడే 
ఆది సర్పము తలను సిలువలో చితుకద్రోక్కినాడే

విడువరాని మహాభాగ్యము విడచి భువికి వచ్చినాడే 
మోసగాని మోసమంతయు బట్టబయలు చేసినాడే 
పాపపు విషమంతా సిలువ బలముతో తొలగించి 
మరణ పత్రపు అధికారమును ఎత్తివేసినాడే 
ఉన్న తోడనే కలువరి శిలువను ఆశ్రయించగానే 
రెప్పపాటునే నవీనత్వము మనకు సొంతమగునే

-----------------------------------------------------
CREDITS : Holy Judge Ministries
-----------------------------------------------------