** TELUGU LYRICS **
చల్లగాలి నా మదినే తాకెను చలి రాతిరిలో చిరునవ్వు పుట్టెను (2)
దూత చెప్పిన శుభవార్తకు నా హృదయం ఉప్పొంగెను (2)
ఆ దూత ఏమని చెప్పెను
పరిశుద్ధుడు పుట్టెనని పరవశించి చెప్పెను
మహారాజు వచ్చేనని జగమంత చాటెను (2)
||చల్లగాలి||
కన్యక గర్భాన నా ప్రియుడు పుట్టినాడొయమ్మ
నను లాలించి పాలింప వచ్చెనోయమ్మ (2)
అల్లారుముద్దుగా అమ్మ ఒడిలో ఆడెను
సత్రములో సంబరాలు సాగెను (2)
చిన్ని తండ్రి వచ్చెను చింతలెల్ల బాపెను (2)
పరిశుద్ధుడు పుట్టెనని పరవశించి చెప్పెను
మహారాజు వచ్చేనని జగమంత చాటెను (2)
||చల్లగాలి||
పసిప్రాయన ప్రవక్తలా ప్రకటించెనోయమ్మా
ఆయన నోటితో పరలోక మార్గం భోధించెనోయమ్మ (2)
తండ్రి చిత్తం నెరవేర్చ సన్నిధిలో వుండెను
రక్షకుని రాకతో లోకమంతా సందడి చేసెను (2)
రక్షకుడు పుట్టెను రక్షనే తెచ్చెను (2)
పరిశుద్ధుడు పుట్టెనని పరవశించి చెప్పెను
మహారాజు వచ్చేనని జగమంత చాటెను (2)
||చల్లగాలి||
------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Gidion
Music & Vocals : Sudhakar Rella & Surya Prakash Injarapu
-----------------------------------------------------------------------------------------