5361) పుట్టేను రక్షకుడు పసిబాలుడై సింహాసనం వీడి సత్రంలోకి

** TELUGU LYRICS **

పుట్టేను రక్షకుడు పసిబాలుడై 
సింహాసనం వీడి సత్రంలోకి
దావీదు పురమందు దయనీయుడై
సామాన్యుల సామంతులుగా చేయుటకు
నలిగిన వారికి ఊరటనిచ్చుటకు 
చెరలో వారికీ విడుదలనిచ్చుటకు 
ఈయేసే మనపాలి రక్షకుడు
మనలాంటి మానవుడై పుట్టాడు

ప్రజలంతా ఎదురు చూచు మంచిరోజిదే 
పరలోకడేవుడే పుడమికేగేనే 
పరిశుద్ధుడే పసిబాలుడై
పశుసాలలో పవళించేనే 
పరమందు దూతాళి స్తోత్రాలు చేయగా
పురమందు సంబరాలు అంబరాన్ని తాకేగా  

అందాల తారోకటి నింగిలో వెలిసింది
అంధకారమందు వెలుగులు చిమ్మింది 
ఆదియందు ఉన్నా ఆ.. వాక్యమే 
అవనిలో శరీరమొంది నివసించేనే 
అందరిలాకాకున్నా అందరికై పుట్టాడు
అందలాన్ని వదిలేసి బంధువై నిలిచాడు 

------------------------------------------------------------
CREDITS : Music: Prasanth Penumaka 
Lyrics, Tune, Vocals : Saahitya Ratna 
------------------------------------------------------------