5362) నీ విచ్చిన రక్షణ పాత్ర ఇది నా నూతన యాత్ర ఇది

** TELUGU LYRICS **

నీ విచ్చిన రక్షణ పాత్ర ఇది
నా నూతన యాత్ర ఇది
నీ వాక్యమె సత్యమైనది యేసయ్యా
నీ మార్గమె చక్కనైనది యేసయ్యా
పరదేశినయ్యా ఇలలో పరదేశినయ్యా
నిను వెంబడింతునయ్యా నను పరము చేర్చవయ్యా
పరదేశినయ్యా ఇలలో పరదేశినయ్యా
నీ పథము వీడనయ్యా నను పరము చేర్చవయ్యా

విశ్వాసమే విస్తరించు రహదారిగా
పరమందు గురియుంచి పయనించెద
విసుగురాని ఎదురుచూపు నాతోడుగా
ఆశకలిగి ఆకశాన్ని తేరిచూచెద
ఆసక్తితో నీ శక్తితో నీకై సాగెదా
నీ ఆత్మతో నేనేకమై నీతో ఉండెద
పరదేశినయ్యా ఇలలో పరదేశినయ్యా
నిను వెంబడింతునయ్యా నను పరము చేర్చవయ్యా
పరదేశినయ్యా ఇలలో పరదేశినయ్యా
నీ పథము వీడనయ్యా నను పరము చేర్చవయ్యా

నా దేహమే ఆలయమై అవతరించగా
మలినమే చేరకుండ మహిమపరచెద
హృదయమే బలిపీఠమై వెలసిల్లగా
స్తుతిప్రార్ధన అర్పణగా నేనర్పించెద
నా జీవితం నీ సేవకై సమర్పించెద
నా శ్వాసను వీడేవరకు నిను సేవించెద
పరదేశినయ్యా ఇలలో పరదేశినయ్యా
నిను వెంబడింతునయ్యా నను పరము చేర్చవయ్యా
పరదేశినయ్యా ఇలలో పరదేశినయ్యా
నీ పథము వీడనయ్యా నను పరము చేర్చవయ్యా

నా గతమే విత్తనమై అంతరించగా
జీవమున్న చెట్టువలె ఫలమిచ్చెద
సహవాసమే సంతోషమై బలపరచగా
పరిమళించు నీ ప్రేమను ప్రకటించెద
అభిషేకమే నను నింపగ నే వెలిగెద
అలుపన్నదే రానీయక నీ పనిచేసెద
పరదేశినయ్యా ఇలలో పరదేశినయ్యా
నిను వెంబడింతునయ్యా నను పరము చేర్చవయ్యా
పరదేశినయ్యా ఇలలో పరదేశినయ్యా
నీ పథము వీడనయ్యా నను పరము చేర్చవయ్యా

-----------------------------------------------------------------------------------
CREDITS : Tune, Vocals : Pastor Samuel Paul Rowthu
Lyrics & Music : Nathanael & Joshi Madasu
-----------------------------------------------------------------------------------