5363) ఎదగనివ్వని లోకములో ఒదిగిపో చేసితివే నీ ఒడిలో

** TELUGU LYRICS **

ఎదగనివ్వని లోకములో ఒదిగిపో చేసితివే నీ ఒడిలో
నిలువ నీయని నిందలలో నిలిచిపోచేసితివే నీ నీడలో 
కన్నీలనే కావ్యాలుగా గాయాలనే గేయాలుగా 
మార్చినావయ్య నను మరువలేదయ్య 

సమాధి తోటగా - సోకపు ఊటగా ఉన్న నా హృదయం 
సంతోష ఫలముగా - సియోను పాటగా సరి చేసినది నీవే కదా
సిగ్గుపడను నేను నీ శక్తి పైన నేను ఆధార పడెదను
సాధించగలను ఏదైనా నేను నీ సాయము నా కుండగా

గాలికి తెగినది గమ్యము లేనిదీ గాలివాటమైన గమనము
గాలిని గద్దించి గొప్పగా దీవించి గెలిపించినది నీవే కదా
గతి లేని నన్ను బ్రతికించి నావు గుండె లోనే ఉండిపోదునే 
గురి లేని నను గుర్తించి నావు గడియ కూడా మరువలేదయ

పాడైన పురముగా - ఖాలీ యైన పాత్రగా - ఉన్న నా జీవితం 
పరిశుద్ధ స్తలముగా పొంగుతున్న ఊటగ మలచినది నీవే కదా 
పాతాళ ద్వారము పనిచేయదు నాపై ప్రేమించే నీ వుండగా
ప్రాణమైన పోయిన ప్రాణమిచిన నిన్ను నే విడువలేనుగా 

---------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Paul Jacob 
Music & Vocals : S.Ebinezer Anna & Nandini 
---------------------------------------------------------------------