5330) ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జన్మించెను

** TELUGU LYRICS **

ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జన్మించెను
నిన్న నేడు నిరంతరం జీవాహారమై 
నిలిచెను జీవాహారమై నిలిచెను

దేవునిప్రేమ శాశ్వతమైనది
మనలను రక్షించగా ఇలలో వెలసినది 
మనలను రక్షించగా ఇలలో వెలసినది

పరమునేలె పరిశుద్ధుడు భువికేతెంచగా 
వరములు సెలయేరులై  ప్రవహించెను
క్రీస్తు శరీరరక్తములను స్వీకరింతుము 
ఇమ్మానుయేలుదేవుని  సేవింతుము 

దేవునిప్రేమ శాశ్వతమైనది
మనలను రక్షించగా ఇలలో వెలసినది 
మనలను రక్షించగా ఇలలో వెలసినది

భువినిఏలె క్రీస్తునివిందును స్వీకరించగా 
పవిత్రబాటలో నిత్యం పయనింతుము 
జీవాధిపతియైన దేవుని స్తుతియించెదము 
ఆనందముగ అనుదినము ఆత్మలో నడిచెదము

దేవునిప్రేమ శాశ్వతమైనది
మనలను రక్షించగా ఇలలో వెలసినది 
మనలను రక్షించగా ఇలలో వెలసినది

హృదినిఏలె శ్రీయేసు మనలో వెంచేయగా 
శాంతి సమాధానములు తోడాయెను  
మనలో కొలువైన దేవుని  పూజింతుము 
లోకమంతట క్రీస్తుప్రేమను ఘనముగ చాటెదము

దేవునిప్రేమ శాశ్వతమైనది
మనలను రక్షించగా ఇలలో వెలసినది 
మనలను రక్షించగా ఇలలో వెలసినది

----------------------------------------------------
CREDITS : Rev. Fr. Yohanu Katru 
----------------------------------------------------