** TELUGU LYRICS **
సర్వలోకమునకు సంతోషమే ఇష్టులైనవారికి సమాధానమే (2)
సంతోషమే సమాధానమే యేసు జన్మించె లోక కల్యాణమై (2)
పాపానికి పరిహారమై
ఆదియందు వాక్యం - వాక్యమైన దైవం
పుడమిలోన జన్మించెను - నరరూప ధారిగా (2)
ఈనాడే క్రొత్తవెలుగు - ఆకాశంలో వెలిగింది
ప్రభుయేసు జన్మగూర్చి - తెలిపింది ఆ ధృవతార
తారనుగాంచిన జ్ఞానులు - ప్రభునారాధించిరి
||సర్వలోక||
ఈనాడే క్రొత్తవెలుగు - ఆకాశంలో వెలిగింది
ప్రభుయేసు జన్మగూర్చి - తెలిపింది ఆ ధృవతార
తారనుగాంచిన జ్ఞానులు - ప్రభునారాధించిరి
||సర్వలోక||
మార్గమైన సత్యం - సత్యమైన జీవం
త్రిత్వమైన దైవం - ప్రత్యక్షమాయెగా (2)
తన ప్రజల పాపమంత - తానే భరియించుట కొరకు
తన ప్రజల పాపమంత - తానే భరియించుట కొరకు
దైవానికి వారసులుగా - మానవులను తీర్చుట కొరకు
యేసు నామధారుడై - ఇలలో జన్మించెను
యేసు నామధారుడై - ఇలలో జన్మించెను
||సర్వలోక||
-----------------------------------------------------------
CREDITS : Music : Madhan MM
Lyrics,Tune, vocals : Kaluvala Srinivas
-----------------------------------------------------------