5407) పశువులపాక చోటిచ్చెను ప్రభువునకు

** TELUGU LYRICS **

పశువులపాక చోటిచ్చెను ప్రభువునకు (2)
తనలో దాగమని తన ఉనికిని చాటమని (2)

కన్నెయ మరియమ్మ గర్భమందున బేత్లెహేమను ఊరిలో (2)
పశువుల పాకలో జన్మించెను ప్రభువు (2)
దైవ పుత్రుండు మనుజుడాయెను (2)

గొల్లలు బోయలు ప్రభువుని కనుగొని వర్తమానమందరికి తెల్పిరి (2)
నక్షత్రముగని తూర్పు జ్ఞానులు నడిచిరి (2)
బోళము సాంబ్రాణిని అర్పించి మొక్కిరి (2)

లోకమంతట వెలుగు ప్రకాశించి చీకటిలోవున్న జనులను వెలుగు చూచిరి (2)
మన పాపముకొరకై  మన దోషము కొరకై (2)
శరీర ధారిగా అవతరించెను (2)

--------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Radha Franklin
Music : Spurgeon Raju Gamidi
---------------------------------------------------------------