5406) అందా చందాల యేసు బాలా బంగారు యేసు

** TELUGU LYRICS **

ఆహా.. ఓహో.. ఆహా.. ఓహో..
బలె బలె బలె బలె
అందా చందాల యేసు బాలా బంగారు యేసు 
మనతో ఉండాలని వచ్చిండు - పరలోకం విడచి పశువుల పాకలో పుట్టిండు (2)
పుట్టిన వేళ విశేషమంటు పండుగ చేయ
తరించరండు - కారణ జన్ముని కాపుదల
కలకాలం మనతో ఉండాలంటు
కోళాటమాడ రారండి ఓ అమ్మల్లారా - కానుకలర్పించగ రారండి - ఓయన్నల్లరా (2)
     
అంద చందాల బాల యేసయ్యా     
నిన్ను కన్న లోకాని కెంతో మేలయ్యా     
పాప లోకన పుట్టినావయ్యా     
లోక పాపం నశింప జేసినావయ్యా (2)
పాపుల పాలిటి పెన్నిధి నీవై     
దీనుల పాలిట ధన్యత నీవై     
దయగల దేవుని దర్శన మీయగ     
దారిని చూపె ధాతవు నీవై (2)
దివి నుండి దిగివచ్చావయ్యా మా కోసం నీవు
భువి నుండ ఆశించావయ్యా మా గుండెల గుడిలో
||అహ||

అల్ఫా ఒమెగ నీవే యేసయ్యా
ఆది అంతం నీకంటు లేనే లేదయ్య
నిత్య నివాసి నీవే యేసయ్యా
నీకు సాటి మేటైన వారేలేరయ్యా 
ఆహా.. ఓహో.. ఆహా.. ఓహో..
బలె బలె బలె బలె
||అహ||

ఆది అంతం లేనే లేదు
మాయ మర్మము కానే కాదు
మహిమను వీడి మనిషిగా మనతో 
ఉండాలని జన్మించినవాడు
జగమా జయగీతిక పాడమ్మ  జన్మించెను యేసు   
మహిమ కార్యాలను చూడమ్మ విశ్వాసిగా నీవు
ఆహా.. ఓహో.. ఆహా.. ఓహో..
బలె బలె బలె బలె
||అహ|| ||అంద||

-----------------------------------------------------------------
CREDITS : Music : Immi Johnson
Vocals: Pas. Bethu Vivek, Bethu Prasanth
-----------------------------------------------------------------