5405) దావీదు పురములో బేత్లెహేము నగరిలో ఆ పశులశాలలో

** TELUGU LYRICS **

దావీదు పురములో బేత్లెహేము నగరిలో 
ఆ పశులశాలలో రక్షకుడే పుట్టెను
దావీదు పురములో బేత్లెహేము నగరిలో 
ఆ పశుల శాలలో రక్షకుడే పుట్టెను
లోకాలనేలెడి రారాజును చూడగా
రారండి జనులారా ఆరాధన చేయగా
లోకాలనేలెడి రారాజును చూడగా
రారండి జనులారా ఆరాధన చేయగా
ఆనందం మహా ఆనందం హృదయ ఆనందం పరమానందం
సంతోషం - గొప్ప సంతోషం - దివ్య సంతోషం - నిత్య సంతోషం

అర్ధరాత్రి చీకటంతా పారిపోయేగా
ఆకశాన ఉదయించె నవ్య తారక
లోకమంత దివ్య వెలుగు ప్రకాశించగా
జ్ఞానులు గొల్లలు వచ్చి మ్రొక్కగా 
పాపుల పాలిట పెన్నిధిగా
దీనుల యెడల దైవముగా
రోగుల పాలిట వైద్యునిగా
నమ్మిన వారికి రక్షణగా
పాపుల పాలిట విడుదలగా 
దీనుల యెడల ధీరునిగా 
రోగుల పాలిట స్వస్థతగా
నమ్మిన వారికి నిత్యునిగా

ఆనందం మహా ఆనందం హృదయ ఆనందం పరమానందం
సంతోషం - గొప్ప సంతోషం - దివ్య సంతోషం - నిత్య సంతోషం
ఆనందం మహా ఆనందం హృదయ ఆనందం పరమానందం
సంతోషం - గొప్ప సంతోషం - దివ్య సంతోషం - నిత్య సంతోషం

భువిని వెలసెను అద్వితీయుడు
మహిమా తేజుడు మహిమోన్నతుడు
జన్మించినాడు శ్రీ యేసుడు
జగమంత పండుగ చేసెదము
భువిని వెలసిన అద్వితీయుడు
మహిమా తేజుడు మహిమోన్నతుడు
జన్మించినాడు శ్రీ యేసుడు
జగమంత పండుగ చేసెదము
రారాజు మహా రారాజు నేడే పుట్టినాడు మన మహా రారాజు 
శ్రీమంతుడు సర్వ శక్తి మంతుడు ధరణి పుట్టినాడు మన సర్వోన్నతుడు 
రారాజు మహా రారాజు నేడే పుట్టినాడు మన మహా రారాజు
శ్రీమంతుడు సర్వ శక్తి మంతుడు ధరణి పుట్టినాడు 
మన

-------------------------------------------------------------
CREDITS : Lyrics : Pastor Mary Moses
Vocals, Music : Anthony Abhilash
Youtube Link : 👉 Click Here
-------------------------------------------------------------