5404) రారాజు ఇలలోన పుట్టెను లోకానికి వెలుగు వచ్చెను

/div>
** TELUGU LYRICS **

రారాజు ఇలలోన పుట్టెను - లోకానికి వెలుగు వచ్చెను 
ఆ రాజు నీలోన పుట్టెనా - నీ బ్రతుకులొ చీకటి పోయెన 
క్రీస్తు జన్మ ఉద్దేశము - క్రైస్తవమా అర్ధమాయేన 
చేద్దామ అసలైన పండగ - యేసయ్య మన హృదిలో ఉండగా 

యేసయ్య జన్మలో తగ్గింపు ఉన్నది 
తండ్రి ఇష్టానికి విధేయతున్నది 
ఆత్మలో దీనులమైతే - నిత్య రాజ్యములో ఉంటామంట 
తండ్రి ఇష్టాన్ని నెరవేరిస్తే బ్రతుకంత పండగెనంట 

యేసయ్య పుట్టుకలో త్యాగమున్నది 
నీపై నాపై ఎంతో ప్రేమ ఉన్నది 
లోకరీతి ఆచారాలు - తిని త్రాగే సంబరాలు 
విడిచిపెట్టి ప్రభుని చేరితే నిజమైన క్రిస్మస్ అంట

కొత్త కొత్త బట్టలతో విలువ వస్తది 
కొత్త మనసు లేక చస్తే నరకమొస్తది 
అలంకరణ భక్తి కాదుగా క్రిస్మస్ అంటే 
ఆత్మతో ఆరాధనెగా 
కుటుంబాలు కుటుంబాలుగా మనమంత  
ప్రభుని సేవించడమేగా

----------------------------------------------------------
CREDITS : Music : Shyam Joseph
Lyrics, Tune, Vocals : Joshua Prasad
----------------------------------------------------------