** TELUGU LYRICS **
హ్యాపీ క్రిస్మస్ - మేరీ క్రిస్మస్
బెత్లహేము పురములో యేసు పుట్టెను
పాపుల రక్షకుడు ఇల అవతరించెను (2)
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిత్యుడగు తండ్రి బలమైన దేవుడు
సమాధాన కర్త అధిపతి పేరు పరలోకమే ఆయన ఊరు
సంతోషమే ఇక సంభరమే ఆనందమే పరమానందమే (2)
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిత్యుడగు తండ్రి బలమైన దేవుడు
సమాధాన కర్త అధిపతి పేరు పరలోకమే ఆయన ఊరు
సంతోషమే ఇక సంభరమే ఆనందమే పరమానందమే (2)
పాపియైన మానవుని రక్షింపను - దేవుని సన్నిధికి మనలను చేర్చెను (2)
తన మార్గంలో నడిపించెను - మహిమను విడచి భువికేతెంచెను
||హ్యాపీ||
కోల్పోయిన సమాధానం మనకివ్వను పరిశుద్ధాత్మానితో మనలను నింపెను (2)
సత్యంగూర్చి ఇల ప్రకటింపను ఆది సంభూతునిగా అవతరించెను (2)
||హ్యాపీ||
చీకటి బ్రతుకును వెలిగించెను - జీవవాక్యంతో మనలను నింపెను (2)
నిత్యజీవం మనకు అనుగ్రహించెను - జీవాధిపతియే లోకంలో పుట్టెను (2)
||హ్యాపీ||
సృష్టిని సృజియించిన సృష్టికర్తకు స్థలములేక పశుల తొట్టె పరుపాయెను (2)
మనహృదిలో నివశింపను - నరరూపునిగా ఇల జన్మించెను (2)
||హ్యాపీ||
-----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pas. J. Kumar
Vocals & Music : J. Abhishek & Jakie Vardhan
-----------------------------------------------------------------------