5344) పరలోకము నుండి దిగివచ్చిన జీవహారము క్రీస్తు

** TELUGU LYRICS **

పరలోకము నుండి దిగివచ్చిన జీవహారము క్రీస్తు (2)
రండి రారండి స్వీకరించండి
నాకై నీకై అప్పమై మారిన క్రీస్తుని భుజించరారండి (2)

నా శరీరము నిజమైన ఆహారము 
నా రక్తము నిజమైన పానము 
శరీరము భుజించి రక్తము పానము 
చేసిన వారు నాయందును వారిలో నేను ఉందును

తండ్రి దేవుడు ప్రసాదించిన నిజమైన పరలోక ఆహారము 
ఎన్నటికీని ఆకలిగొనని నిత్యజీవపు ఆహారము (2)
నిత్యజీవమిచ్చు శాశ్వత భోజనం భుజించుటకై రారండి  (2) 
||నా శరీరము||

మన్నాను భుజించియు మరణించినారు 
పితరులు ఎల్లరు ఎడారిలో  మన్నాకన్నా మిన్నదైన జీవాహారము నేనే (2)
నన్ను భుజించువారు మరణింపరు కానీ నిరంతరం జీవించును (2)  
||నా శరీరము||

------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Fr.Binoy Kanayinkal
Vocals & Music : Harsha Vardhan Chavali & Joseph Pasala
------------------------------------------------------------------------------------------