5343) నను పేరు పెట్టి పిలిచినది నీవే కదా

** TELUGU LYRICS **

నను పేరు పెట్టి పిలిచినది నీవే కదా
నా చేయి పట్టి నడిపితివి నీవే సదా
పనికి రాని నన్ను నీ పాత్రగా మలచుటకు 
యుగయుగములు నీతో నే జీవించుటకు
నిను నీవే నాకు బయలు పరచుకుంటివి
నీ రక్షణ మార్గములోనికి నన్ను నడుపుచుంటివి 
||నను పేరు|| 

తల్లి గర్భమందు నే రూపింపబడక మునుపే
నీదు ప్రేమ జీవగ్రంథమందు నన్ను నిలిపే (2)
ఎంతగా కరుణించితివో నీ నామము ఎరుగుటకు
ఏ అర్హత చూసితివో నీ ప్రేమను పొందుటకు (2) 
||నను పేరు|| 

ఈ జగతికి  పునాదులు వేయకన్నా ముందుగా
నీ తలపులలో నేను నిలిచి యుంటి నిండుగా (2)
నీదు ప్రేమ అవసరము నాకుందని గుర్తించి 
నీ ముద్రను వేసితివి సిలువలో నను రక్షించి (2) 
||పనికి రాని||

------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Sayaram Gattu  
Vocals & Music : Mayukh Raj Gattu & Prasanth Penumaka
------------------------------------------------------------------------------------------