** TELUGU LYRICS **
నిను పాడి కీర్తించే కృప నిచ్చినావయా (2)
గతకాలమంత కాచినవయ్య
కను పాపలా బ్రోచినవయ్య
గతకాలమంత కాచినవయ్య
పసి బిడ్డల సాకినవయ్య
గతకాలమంత కాచినవయ్య
కను పాపలా బ్రోచినవయ్య
గతకాలమంత కాచినవయ్య
పసి బిడ్డల సాకినవయ్య
||నిను పాడి||
ఎన్నెన్నో ఆపదలు నను చుట్టి ముట్టిన
సాతాను దాడులు నాపై చేసిన (2)
విడువలేదయ్య నన్ను మరువలేదయ్య
నీ కృపతో నన్ను నడిపినవయ్య (2)
||నిను పాడి||
లోకమంత ఏకమై నా పైన లేచిన
నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయిన (2)
మరువ లేదయ్యా నన్ను విడువలేదయ్యా
నా ప్రాణహితుడవై దరినిలచినావయా (2)
||నిను పాడి||
చీకటిలే నాబ్రతుకును కలవార పరచగా
బంధుమిత్రులే నన్ను అపహాస్యం చేయగా (2)
మరువ లేదయ్యా నన్ను విడువలేదయ్యా
నా బంధువుగా దరీ నిలిచినా వయ్యా (2)
||నిను పాడి||
------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune & Music : Bro. L B Samuel & Ashok M
Vocals : Bro. L B Samuel, Surya Prakash Injarapu
------------------------------------------------------------------------------------------------