5309) నిను బట్టియే కలిగెను యేసూ నాకున్న ఈ ధైర్యము

** TELUGU LYRICS **

నిను బట్టియే కలిగెను యేసూ నాకున్న ఈ ధైర్యము 
కనికరింపబడి కృపపొందుటకును 
చేరెదను కృపాసనము

నేను మొరపెట్టిన కష్టదినమందున 
ఉత్తరమిచ్చియుంటివి గదా 
నా ప్రాణములోన త్రాణ పుట్టించి 
నిబ్బరముగనుంచితివి గదా 
స్తుతియించెదను నిన్నే సదా

నేను పయనించిన మార్గములయందున 
తోడుగవచ్చియుంటివి గదా 
దిగులుపడకని జడియవలదని 
ప్రోత్సాహపరచితివి గదా 
స్తుతియించెదను నిన్నే సదా

నేను భరియించిన అన్ని శ్రమలందున 
ఓపికనిచ్చియుంటివి గదా 
ఆదరణతో నింపి ఆనందమునిచ్చి 
ఉప్పొంగజేసితివి గదా 
స్తుతియించెదను నిన్నే సదా

-------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music, Vocals : Dr. A.R.Stevenson
-------------------------------------------------------------------------------------------