5308) ఆదియందున్న వాక్యమా వాక్యమైయున్న మా దేవా

** TELUGU LYRICS **

ఆదియందున్న వాక్యమా
వాక్యమైయున్న మా దేవా
నీ వాక్కుతో సమస్తమును సృష్టించితివి విశ్వమును 
నీ వాక్కుతో నడుపుదువు
ఆహాహా ధ్యానింతుము
సదా వాక్యమును ధ్యానింతుము
ఆహాహా ధ్యానింతుము
సదా మదిలో ధ్యానింతుము

శాసనములు హృదయానందకరములు
సర్వసంపదలు కలిగించునవి
ఉపదేశ మార్గములు బోధించుము
అవి మాకు నిత్యమగు స్వాస్థ్యములు
||అహాహా||

నీ కట్టడలే మాకు ప్రియమైనవి
బంగారు కంటె కోరదగినవి
అపరంజి కంటెను విలువైనవి
నిత్యము లక్ష్యము చేసెదము
||అహాహా||

మీ వాక్యములే నా పాదములకు దీపము
నా త్రోవకు వెలుగును చూపునవి
నీ వాక్యమును అనుసరించి నడిచెదను
నీ మార్గములో నన్ను స్థిరపరచుమయ్యా
||అహాహా||

----------------------------------------------------------------------
CREDITS : Bishop Rachel Jyothi Komanapalli
----------------------------------------------------------------------