5341) నేను నిరంతరము నా ప్రభువును స్తుతింతును

** TELUGU LYRICS **

నేను నిరంతరము నా ప్రభువును స్తుతింతును
జీవితకాలమంతయు నా ప్రభువును కొనియాడుదును
మనరాజైన ప్రభు మహాత్మ్యమును నిరంతరము స్తుతించెదము 
ప్రభు నామమును ప్రతిదినము ప్రణమిల్లి ప్రణుతింతుము (2)
మహామహుడా నీ మహాకార్యములు కీర్తించి ప్రస్తుతింతుము

నేను నిరంతరం నా ప్రభువును స్తుతింతును
జీవితకాలమంతయు నా ప్రభువును కొనియాడుదును (2)

మేమెల్లరము ఎనలేని నీ మేలులన్ పొగడుచున్నాం
ప్రాణికోటిని అంతటినీ నీ నేనరుతో చూచునుగా (2)
కలకాలము నీ పరిపాలనా మాకు లభించెనులే
లెక్కలేని ఆశీస్సులతో మమ్ము నడిపిన మహారాజా
మరువము మేము యేసయ్య ఎన్నడును నీ మేలులను
||నేను నిరంతరం||

మార్పు రాని మా మొరలన్నియు నీకు మొరపెట్టగా
పిడితులకు న్యాయమును బంధీలకు విడుదలను (2)
 ఆకలి గలవారికాహారం రోగులకెల్ల స్వస్థతయు
కృంగిన వారి నీ లేవనెత్తి భక్తుల కోరికల్ నెరవెర్చి 
నడిపిన దేవా యేసయ్య నీ సువార్తను చాటేదము
||నేను నిరంతరం||

----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Fr.Binoy Kanayinkal
Music & Vocals : Joseph Pasala & Sai Charan
----------------------------------------------------------------------