** TELUGU LYRICS **
కలతలతో నిండినా - కల చెదరిపోయినా
కన్నీరే మిగిలినా - కలవరపడకు
కన్నీరే మిగిలినా - కలవరపడకు
శత్రువులే తరిమినా - నీ వారే గెంటినా
అంతా కోల్పోయినా - కలవరపడకు (2)
నమ్మదగిన దేవుడు - యేసయ్యేగా
ఆదరించె నాధుడు - ఆ ప్రభువేగా (2)
దిగులు చెందకు - భయమునొందక (2)
||కలతలతో||
అంతా కోల్పోయినా - కలవరపడకు (2)
నమ్మదగిన దేవుడు - యేసయ్యేగా
ఆదరించె నాధుడు - ఆ ప్రభువేగా (2)
దిగులు చెందకు - భయమునొందక (2)
||కలతలతో||
నీ కష్టము నీ నష్టము - ఎరుగకుండనే
సూటిపోటి మాటలతో - గాయపరచిరా
నీకంటూ విలువన్నది - ఇవ్వకుండనే
నీ జ్ఞానము వెర్రిదని - త్రోసివేసిరా (2)
దేవుడే చూసాడు - నీ నిందలను
ఆయనే తీర్చును - నీ బాధలను (2)
||నమ్మదగిన దేవుడు|| ||కలతలతో||
ఈ భారము ఈ బంధము - మోయలేనని
మరణానికి మార్గమును - ఎంచుకుంటివా
కలకాలము జీవించే - తోడు లేదని
గతమంతా తలచుకొని - కుమిలిపోతివా (2)
యేసే నీ తోడై - నడిపిస్తాడమ్మా
ప్రేమతో నిన్ను - చేరదీస్తాడమ్మా (2)
||నమ్మదగిన దేవుడు|| ||కలతలతో||
-------------------------------------------------------------
CREDITS : Music : G. Sumanth Prasad
Lyrics, Tune, Vocals : Uday Kumar
-------------------------------------------------------------