** TELUGU LYRICS **
ఎల్రోయి ఎల్రోయి
హలేలూయా ఎల్రోయి (2)
నను చూచిన యేసయ్య
జ్ఞాపకాలు మదిలో మెదిలాయి
నను కాచిన మెస్సయ
తలంపులు నదిలా కదిలాయి (2)
||ఎల్రోయి||
హలేలూయా ఎల్రోయి (2)
నను చూచిన యేసయ్య
జ్ఞాపకాలు మదిలో మెదిలాయి
నను కాచిన మెస్సయ
తలంపులు నదిలా కదిలాయి (2)
||ఎల్రోయి||
గాఢాంధకారములో నీ కన్నులే నన్ను చూచాయి
నీ వెలుగు మార్గములో నీ వాక్కులే నన్ను నడిపాయి
నా కలమునుండి స్తుతి అక్షరాలు జాలువారాయి
నా గళమునుండి స్తుతి కీర్తనలు నిన్ను చేరాయి (2) (నాకల)
||ఎల్రోయి||
మరణాంధకారములో నీ కన్నులే నన్ను కాచాయి
ఆయుష్షు ఆనందం నీలోనే నాకు దొరికాయి
నా కనులనుండి స్తుతి భాష్పాలు పొంగిపొర్లాయి
నీ హస్తమునుండి శుభదీవెనలు నన్నుచేరాయి (2) (నాకనుల)
||ఎల్రోయి||
----------------------------------------------------------------------------------
CREDITS : Music : Davidson gajulavarthi
Vocals & Lyrics : Sis. Jessie karunya & Dr. Ravi Stalin
----------------------------------------------------------------------------------