5338) మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా

** TELUGU LYRICS **

మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా (2)
మనసారా నిను పాడ మదినిండా నిను వేడ (2)
నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్య! 
హల్లేలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన 
మనసంతా నీ కోసం ఈ ఆలాపన (2) 
||మాటే||

లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నను వేదించగా  
మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నను బాదించగా (2)
దిక్కులేని దానను(వాడను) దరికి నిలిచి దరిలేని దానను మార్గమై నిలిచి (2)
నను ప్రేమతో పిలిచినావయ్యా నా పాప శాపం బాపినావయ్యా (2) 
||నేను||

దయగల దేవా నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో
పారవేయ కుండా త్రోసివేయ కుండా విడిపించితివా నను బంధకాలలో (2)
నా కాలగతులలో నీ కృప నాపై విస్తరింప చేసావు విడుదల నిచ్చి (2)
నను ప్రేమతో పిలిచినావయా నాపాపమంతా బాపినావయ్యా (2) 
||నేను||

-----------------------------------
CREDITS : Kj Philip
Music : Sudhakarrella
-----------------------------------