** TELUGU LYRICS **
నమ్మకమైన దేవుడ నీవే నా యేసయ్య
నా ప్రాణహితుడవు నీవేనయ్యా
ప్రార్థించగా స్తుతియించగా నా మనవులాలకించెదవు
ఆకాశమే సరిహద్దుగా నను విస్తరింప చేసేదవు
ఎవరు మరిచినా నీవు నన్ను మరువవు
నీ కృపా క్షేమమే నా వెంట వచ్చును
నా ప్రాణహితుడవు నీవేనయ్యా
ప్రార్థించగా స్తుతియించగా నా మనవులాలకించెదవు
ఆకాశమే సరిహద్దుగా నను విస్తరింప చేసేదవు
ఎవరు మరిచినా నీవు నన్ను మరువవు
నీ కృపా క్షేమమే నా వెంట వచ్చును
సొంత వారె కాదని మనసును గాయపరిచిన
తోబుట్టువులే తొలి ప్రేమ మరిచిన (2)
అల్లరి జనము మధ్యలో ఆత్మాభిషక్తుడైన
యెఫ్తాని నీవు మరువ లేదయ్యా (2)
||ఎవరు మరిచిన||
కన్నీళ్లే కలవరములై అన్నపానములైన
నా అనుకున్న వారె నిందలతో కృంగదీసిన (2)
ఐగుప్తు ధనము కన్నా నిందలే భాగ్యమన్న
మోషేని నీవు మరువ లేదయ్యా (2)
||ఎవరు మరిచిన||
ఎన్నికే లేని నన్ను ఎంపిక చేసావు
ఎక్కలేనంతగా ప్రేమ శిఖర మెక్కించావు (2)
కరుణించి కటాక్షించి కృపలో స్థిరపరిచి
నీ రాకలో నన్ను మరచిపోకయ్యా (2)
||ఎవరు మరిచిన||
------------------------------------------------------
CREDITS : Pastor Raja Vijayawada
------------------------------------------------------