5300) ఏమున్నా లేకున్నా యేసుంటేనే మిన్న

** TELUGU LYRICS **

ఏమున్నా లేకున్నా యేసుంటేనే మిన్న 
తెలుసుకో ఓ సోదరా నీ బ్రతుకును
మార్చుకో ఓసోదరీ

అన్నవున్నాడని బ్రమపడకు తమ్ముడా 
తమ్ముడున్నాడని బ్రమపడకు ఓరన్నా 
చివరికి నీవు ఏమిలేకపోదువు 
ఆ తరువాత నీకు యేసే దిక్కు ఓరన్నా

ధనముందని నీవు దగా చేయకురన్నా
బలముందని నీవు విర్రవీగకురన్నా
నీ ధనము నీ బలము అంతాపోవును
ఆ తరువాత నీకు యేసే దిక్కు ఓరన్నా

ఆకాశము నీదని బ్రమపడకు ఓరన్నా
ఈ భూమి నాదని ఆశించకు ఓరన్నా
ఆకాశము భూమి అంతాపోవును 
ఆ తరువాత నీకు యేసే దిక్కు ఓరన్నా

-------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Jaipaul Pathri 
Music & Vocals : Sunil Kumar.Y & Raj Kumar Pathri
-------------------------------------------------------------------------------