5298) భయమే లేదయ్య దిగులే లేదయ్య నీవు నాతో ఉన్న యేసయ్య

** TELUGU LYRICS **

భయమేలేదయ్య దిగులే లేదయ్య నీవు నాతో ఉన్న యేసయ్య 
కొరతేలేదయ్య కలవరమే రాదయ్య కౌగిలిలో నన్ను దాచవేసయ్య (2)
ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నవే నా దాగు చోటు నీవే యేసయ్య 
||భయమేలేదయ్యా||

ప్రాణ ప్రీతి నాకు కలుగగా నీ రెక్కల చాటున నన్ను దాచవే 
ఆందోళనలో నేను ఉండగా నీ మాటతో నన్ను అదుకున్నావే (2)
క్షణమైనా నన్ను మరువకుండ భద్రము చేసావే (2)
ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నవే నా దాగు చోటు నీవే యేసయ్య 
||భయమేలేదయ్యా||

గుండె పగిలి గాయమవ్వగా స్వస్థాపరిచి బాగుచేసావే 
చీకటి కోరలు తరుముచుండగా వెలుగులో నన్ను ఏదుర్కున్నవే (2)
క్షణమైనా నన్ను మరువకుండ భద్రము చేసావే (2)
ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నవే నా దాగు చోటు నీవే యేసయ్య 
ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నవే నా దాగు చోటు నీవే యేసయ్య 
||భయమేలేదయ్యా||

--------------------------------------------------------------
CREDITS : Vocals : Sis Snigdha Ratnam
Lyrics, Tune, Music : Bro KY Ratnam 
--------------------------------------------------------------