5297) నాదంటూ ఏముందీ ఈ లోకాన

** TELUGU LYRICS **

నాదంటూ ఏముందీ ఈ లోకాన
నాకంటూ ఎవరున్నారూ ఈ లోకాన
కాలిపోయే కట్టే కదా నేను
మూడునాళ్ల ముచ్చటే కదా నేను 
||నాదంటూ||

కనిపించే ఈ రూపం నాది కాదు 
నాలో ఉన్నదీ నాది  కాదు నాతో ఉన్నది నా వాళ్లు కారు
ఎక్కడనుండి వచ్చానో నేను ఈ లోకానికి నాకు  తెలిపిందెవరు                               
||నాదంటూ||

దేహం అన్నారు ప్రాణం అన్నారు ధనం అన్నారు ఇదే జీవితమన్నారు
ఎవరు చెప్పారు నాకు ఇది అబద్దమని 
ఎవరు తెలిపారు నాకు ఇదంతా నటన అని     
||నాదంటూ||

మరణం ఒక జ్ఞానం అని ఈ లోకాన నాది ప్రయాణమే అని 
నా చిరునామా పరలోకమని నాకు తెలిపింది ఈ గ్రంథమే కదా
||నాదంటూ||

ముగిసిపోని జీవం నాదనీ తరిగిపోని ఆయుష్షు నాకున్నదనీ 
క్రీస్తుతోనే నా బ్రతుకనీ నాకు నేర్పిన ఈ గ్రంథానికే అంకితం నా ఈ జీవితం
||నాదంటూ||

------------------------------------------------------
CREDITS : Dr. B. Ravi Kanth Garu
------------------------------------------------------