** TELUGU LYRICS **
నా జీవిత పయనములో నీతో నడిచే క్షణములే
మరపురాని మధురములు వెలకట్టలేని విలువలు
నీవు గాక ఏది సత్యం ఇలలోన ఏది నిత్యం
బ్రతుకుట నీ కోసమే చావైనా బహు లాభమే
మరపురాని మధురములు వెలకట్టలేని విలువలు
నీవు గాక ఏది సత్యం ఇలలోన ఏది నిత్యం
బ్రతుకుట నీ కోసమే చావైనా బహు లాభమే
ధరణియందు దర్శనమిచ్చే భోగాలకు బానిస కాక
శ్రమలయందు ఓర్చుకొందును నేర్చుకొనుటకు విధేయతను
సుఖమునందు శోకమునందు చెలియించక
నా విశ్వాసం స్థిరముకాని ఈ లోకము విడిచి హత్తుకొందును నిన్నే
బ్రతుకునందు భాగ్యమైనది నీ కాడి మోయుటయే
నా ప్రాణాన్ని తృణీకరించి ప్రేమింతును నిండుగా నిన్నే
చిరునవ్వే కరువైన, కన్నీరే కానుకైనా
నీ చిత్తానికి నా తలవంచే కృపనిమ్ము నా ప్రభువా
నా ప్రాణాన్ని తృణీకరించి ప్రేమింతును నిండుగా నిన్నే
చిరునవ్వే కరువైన, కన్నీరే కానుకైనా
నీ చిత్తానికి నా తలవంచే కృపనిమ్ము నా ప్రభువా
పాపమందు ప్రీతిగా ఉల్లశించే జనులయెదుట
పరిశుద్ధమైన నీ నామం ఒప్పుకొందును సిగ్గుపడక
నా చీకటి చెరచీల్చిన నా జీవపు తేజమా
అనుక్షణము ఆనందముగా స్తుతిపాడెద కడదాకా
-------------------------------------------------------------------
CREDITS : Music : Ashok.M
Lyrics & Vocals : Sunaina Ruth & Bro. Issac
-------------------------------------------------------------------