5291) కలకాలం నీ కృపతో నన్ను నడిపే నా దేవా

** TELUGU LYRICS **

కలకాలం నీ కృపతో నన్ను నడిపే నా దేవా
బ్రతుకంత నీ సాక్షిగా నన్ను నిలిపుము నా ప్రభువా
కలనైనా మరువనయ్యా నీ కడకు చేరాలని

⁠కటిక చీకటెదురైన నా జ్యోతివి నీవేగదా
కన్నీటి లోయలో నుండి నన్ను లేవనెత్తిన
నా యేసువా నా యేసువా

శ్రమలెన్ని నన్ను చుట్టినా నా శాంతివి నీవేగదా
శోధన వేదనలో నన్ను వెన్నంటిన
నా యేసువా నా యేసువా

---------------------------------------------
CREDITS : 
---------------------------------------------