5290) నీ కృప లేనిచో సాగలేనయ్య నీ దయ లేనిచో

** TELUGU LYRICS **

నీ కృప లేనిచో 
సాగలేనయ్య నీ దయ లేనిచో 
దేవా నీ సన్నిధిలో బ్రతికితే నాకెంతో మేలయ్య 
బ్రతికితే నాకెంతో క్షేమమయ్య 

యెరూషలేము నుండి దిగజారితిని 
యెరికో ప్రాంతములో కొట్టబడితిని 
కొనప్రాణముతో పడిఉన్న నన్ను 
నీ కృపతో బ్రతికించితివి 

నీ సన్నిధి విడచి పారిపోతిని 
భీకర తుఫాను చేత కొట్టబడితిని 
కూపములో నా ప్రాణము మూర్ఛిల్లగా 
నీ కృప తో దరిచేర్చితివి 

రుచి చూసి ఎరిగితిని నీ ప్రేమను 
కడవరకు నీ సాక్షిగా బ్రతికెదను 
నా జీవిత భాగ్యం నీ సేవయే గదా 
నడిపించుమా నీ కృపతో 

---------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocals : Pas. Apuroop Sagar 
---------------------------------------------------------------------------------