5373) ఇమ్మానుయేలు దేవుడు ఆరాధనకు పాత్రుడు

** TELUGU LYRICS **

ఇమ్మానుయేలు దేవుడు - ఆరాధనకు పాత్రుడు (2)
మానవులను రక్షింపను - మహిమను వీడిన యేసుడు (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2)
||ఇమ్మానుయేలు దేవుడు||

రాజుల రాజు ప్రభువుల ప్రభువు - దీనుడై భూవికి అరుదెంచే (2)
మరణచ్చాయలో నున్నవారికి - అరుణోదయ దర్శనమిచ్చే (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2)
||ఇమ్మానుయేలు దేవుడు||

శోధన బాధలు వేదన కలిగిన - విడిపించుటకు దిగివచ్చే (2)
శాంతి సమాధానము నొసగ - శాంతి ప్రదాతగా ప్రభు వచ్చే (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2)
||ఇమ్మానుయేలు దేవుడు||

పాపము నుండి రక్షించుటకు - యేసు నామము ధరించె (2)
విశ్వసించు వారాలకు - మహా రక్షణ కలిగించే (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2)
||ఇమ్మానుయేలు దేవుడు||

--------------------------------------------------------------------------
CREDITS : Vocals & Music : Harini & KJW Prem
Lyrics, Tune : John Kennedy Bethapudi
--------------------------------------------------------------------------