5372) బేతలేము నిదురబోయే చిన్ని మెస్సయ్యా

** TELUGU LYRICS **

బేతలేము నిదురబోయే చిన్ని మెస్సయ్యా
కనుమూసి కాసేపు నిదురపోవయ్యా (2)

ఆ దూతల సైన్యాలే నింగిలో నిలిచే 
పరిశుద్ధుడు నీవంటూ పాటలు పాడే (2)
నింగిలోని రంగులీను బంగారు తార 
నీవే రారాజువని రయముగ చాటే  (2) 
||బేతలేము||

కల్ల కపట మెరుగని గొల్లలు కూడి 
నీవే తమ రక్షణయని స్త్రోత్రము పాడా (2)
దూర తీరములను దాటి జ్ఞానులొచ్చిరి 
నీవే మహారాజువని నిన్నే కొలిచిరి (2)
||బేతలేము||

తరములలో మర్మమైన దివ్యరూపుడా 
ధరణిలోన వెలసినావు దేవసుతునిగా (2)
నరులనెల్ల పరము జేర్చు రక్షణ వెలుగై 
ప్రకాశింప జనియించిన మహిమతేజుడా (2)
||బేతలేము||

---------------------------------------------------------------------------------
CREDITS : Lyrics and Tune : Sis. M. Deepa Sudhakar 
Music & Vocals : Jp Ramesh & Sofia Glory 
---------------------------------------------------------------------------------