5315) బంగారము వీధులున్న నగరములోన కొలువు దీరిన రారాజు

** TELUGU LYRICS **

బంగారము వీధులున్న నగరములోన
కొలువు దీరిన రారాజు
జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి
మట్టి నేల చేరినాడు
పాపమూ శాపము లెన్నో 
ఉన్న జనమును కోరుకున్నాడు
మనల చేర్చాలని తన 
కొలువు లోనికి రాజ్యమునే విడిచాడు  
||బంగారము|| 

తప్పుల అప్పుకు హద్దులు లేక 
బ్రతుకు భారమవుతుంటే
తప్పులు మన్నించి బరువు 
దించమని తననే వేడుకుంటే (2)
క్షణ కాలమైన ఆలోచించక 
తప్పులు మన్నించుతాడు
మన శిక్షనంత చెల్లించటానికి 
పరము నుండి వచ్చినాడు (2)
||బంగారము|| 

పాపము నిండిన హృదములోన 
నీతి నింప వచ్చినాడు
తనకెంత దూరము మనము వెళ్ళిన 
ప్రేమనంత పంచుతాడు (2)
పాపపు బానిస జనమును పిలిచి
స్నేహము అందించుతాడు
మన దోషమంత రద్దు చేయుటకు 
రారాజు బంటు అయినాడు 
||బంగారము|| 

బంగారము వీధులున్న నగరములోన
కొలువు దీరిన యేసయ్య 
జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి
మట్టి నేల చేరినవయ్యా 
పాపమూ శాపము లెన్నో 
ఉన్న జనమును కోరుకున్నావు 
మమ్ము చేర్చాలని నీ 
కొలువు లోనికి రాజ్యమునే విడిచావు 
||బంగారము|| 

---------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bro. Sayaram Gattu
Music & Vocals : Prasanth Penumaka & S Hanok Raj
Youtube Link : 👉 Click Here
---------------------------------------------------------------------------------